»Cinematographer Praveen Anumolu Dies With Heart Attack
Tollywoodలో విషాదం: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం
సినిమా అందంగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ వంటి పెద్ద పెద్ద సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ సేవలు అందించాడు. అనంతరం ప్రధాన కెమెరామెన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
సినిమా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న మృతి నుంచి వరుస విషాదాలు సినీ పరిశ్రమను వెంటాడుతున్నాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (Cinematographer) ప్రవీణ్ అనుమోలు (Praveen Anumolu) హఠాన్మరణం పొందాడు. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం కలచి వేస్తోంది. నలభై ఏళ్ల వయసు కూడా లేదు. సినిమాపై ప్యాషన్ తో వచ్చిన ప్రవీణ్ అర్ధాంతరంగా తనువు చాలించాడు. అతడి మృతికి సినీ ప్రముఖులు, సినిమాటోగ్రాఫర్లు సంతాపం వ్యక్తం చేశారు.
సినిమా అందంగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో మొదట అసిస్టెంట్ కెమెరామెన్ (Assistant Cameraman)గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాజీరావు మస్తానీ (Bajirao Mastani), ధూమ్ 3 (Dhoom-3), బేబీ (Baby), పంజా (Panjaa), యమదొంగ (Yamadonga) వంటి పెద్ద పెద్ద సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా ప్రవీణ్ సేవలు అందించాడు. అనంతరం ప్రధాన కెమెరామెన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్ (Sukumar) నిర్మాణంలో 2017లో దర్శకుడు (Darsakudu Movie) అనే సినిమా విడుదలైంది. జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో అశోక్ బండ్రెడ్డి, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ నటించిన ఈ సినిమాకు సినీమాటోగ్రాఫర్ గా ప్రవీణ్ కు అవకాశం దక్కింది. దర్శకుడు సినిమాకు అద్భుతంగా ప్రవీణ్ తన కెమెరాతో సినిమా తీశాడు. ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. అనంతరం ప్రవీణ్ కెమెరామేన్ గా మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వాటి పేర్లు ఇంకా వెల్లడించలేదు.