కడప 1టౌన్ పరిధిలోని పాత బస్టాండ్ బ్రిడ్జి వద్ద ముగ్గురు మట్కా బీటర్లను అరెస్టు చేసి రూ. 4,100 నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. అరెస్టైన వారిలో రవీంద్రనగర్‌కు చెందిన షేక్ సాదిక్ (40), షేక్ ఫయాజ్ (45), మోచంపేటకు చెందిన షేక్ గౌస్ పీర్ (43)లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు.