ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి తో భేటీ అయిన నాయకులను బహిష్కరించింది. పొంగులేటి కొద్ది రోజులుగా నియోజకవర్గ, మండల నేతలతో భేటీ అవుతున్నారు. నేటి ఉదయం ఐదు మండలాల నేతలతో భేటీ అయ్యారు పొంగులేటి.