తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి EAMCET 2023 ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86 శాతం అర్హత సాధించారు. జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది.
ఈ ఫలితాల్లో మొదటి ర్యాంక్ అనిరుథ్ సనపల్లు, సెకండ్ మనీందర్ రెడ్డి, మూడో ర్యాంక్ చల్లా రమేష్, నాలుగో ర్యాంక్ అభినిత్ మంజేటి, ఐదో ర్యాంక్ ప్రమోద్ కుమార్ కైవసం చేసుకున్నారు.
మే 10 నుంచి 14 మే 2023 వరకు జరిగిన TS EAMCET 2023 పరీక్షకు మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TS EAMCET ఫలితాల 2023 ఆధారంగా, విద్యార్థులు తదుపరి అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. BE, BTech, BPharm, PharmD, BSc, BFSc, BVSc వంటి వివిధ UG కోర్సులలో ప్రవేశం తీసుకుంటారు. అర్హులైన విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) నిర్వహిస్తారు.