»Blow For Team India Before Odi World Cup 2023 Australia Replace Rohit Sharmas Team As New No 1
Team India: 4 ఏళ్లలో తొలి సిరీస్ ఓటమి, వన్డేల్లో నెం.1 కోల్పోయిన భారత్
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి.
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి. 2019 ఏప్రిల్ తర్వాత స్వదేశంలో భారత్ కు తొలి వన్డే ఓటమి. అలాగే, అన్ని ఫార్మాట్ లలో కలిపి స్వదేశంలో 26 వరుస సిరీస్ విజయాల తర్వాత భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. చివరగా 2019లో ఆస్ట్రేలియా పైనే భారత్ సిరీస్ ను కోల్పోయింది. అలాగే, రోహిత్ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్ గా స్వదేశంలో ఇది తొలి ఓటమి. ఈ సిరీస్ లో ఓటమి ద్వారా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోను భారత్ కిందకు పడిపోయింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత ఆసీస్ తో సమానంగా 113 పాయింట్లతో టీమిండియా సమానంగా ఉన్నప్పటికీ, మ్యాచ్ విన్నింగ్ శాతం పరంగా ఆసీస్ జట్టు టాప్ ర్యాంకులోకి వెళ్లింది. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది.
ఈ వన్డేకు ముందు 1-1తో సమానంగా ఉంది. కానీ భారత బ్యాటర్లు మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక, చేజేతులారా వికెట్లు పారేసుకున్నారు. స్పిన్నర్లు జంపా, అగర్ లతో మనవాళ్లు ఇబ్బంది పడ్డారు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఎక్కువగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. దీంతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియాను బౌలింగ్ కు ఆహ్వానించింది. మ్యాచ్ సమయంలో స్టేడియంలోకి కాసేపు గద్దలు రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. భారత ఇన్నింగ్స్ 42వ ఓవర్లో స్టెయినీస్ నాలుగో బంతి వేశాక గద్దలు కనిపించాయి. నేలపై ఉన్న ఓ మిడతను ఓ గద్ద తన్నుకుపోయింది. స్పైడర్ కెమెరా చుట్టూ కాసేపు గద్దలు తిరిగాయి. దీంతో ఆటకు కాసేపు ఆటంకం ఏర్పడింది. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత సిరీస్ కోల్పోవడం, వరల్డ్ నెంబర్ వన్ నుండి పడిపోవడం…. వన్డే వరల్డ్ కప్ 2023కి ముందు టీమిండియాకు ఇది షాక్.