BHNG: భువనగిరి బస్టాండ్ వద్ద వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక వృద్ధురాలిని ఢీకొట్టింది. ఇవ్వాళ బస్టాండ్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను భువనగిరి జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.