TG: కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను ఓ వ్యక్తి కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని బేగంబజార్లో చోటు చేసుకుంది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్యను గొంతుకోసి, కుమారుడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చూసిన సిరాజ్ పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.