»Asaduddin Owaisis House Pelted With Stones Urges Police To Take Action
Asaduddin Owaisi: ఎంఐఎం ఎంపీ నివాసంపై రాళ్ల దాడి
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.
Asaduddin Owaisi Interesting Comments On AP Politics
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి. తన ఇంటి పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తాను రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లకముందే ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్నారు. దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఈ దాడి జరిగినట్టుగా పేర్కొన్న అసద్, 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ విధమైన దాడి ఘటనలు జరగడం నాలుగవసారి అని వెల్లడించారు.
ఘటన జరిగిన సమయంలో తాను జైపూర్ లో ఉన్నానని, దాడి గురించి తన ఇంట్లో పని చేసే పనిమనిషి తనకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఇక ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు. హై సెక్యూరిటీ జోన్ గా పిలవబడే ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగిన ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు మేరకు అదనపు డిసిపి ఆయన నివాసాన్ని సందర్శించి పరిశీలించారు. ఢిల్లీ పోలీస్ అధికారులు ఆయన నివాసం నుండి అవసరమైన ఆధారాలను సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా రాజస్థాన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అసదుద్దీన్ పట్టు కోసం, ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.