»Another Malayalam Remake Of Megastar Chiranjeevi For 156
Chiranjeevi: మళ్లీ రీమేకే అంటున్న మెగాస్టార్!?
మెగాస్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే విషయమేదైనా ఉందా అంటే.. అది రీమేకే. చిరంజీవి(Megastar chiranjeevi), పవన్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండు రీమేక్ సినిమాలే. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150 కూడా రీమేక్ సినిమానే. ఇదే కాదు వాల్తేరు వీరయ్యకు ముందు వచ్చిన గాడ్ ఫాదర్ కూడా రీమేక్ మూవీనే. ప్రస్తుతం చేస్తున్న భోళా శంకర్ సైతం రీమేక్ సినిమానే. ఇక ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి మెగాస్టార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్న భోళ శంకర్ ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఆగస్టు 11న భోళా శంకర్ థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్(Megastar chiranjeevi) చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే మెగాస్టార్ కోసం ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. వారిలో సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణతో చిరు ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మించనుందని టాక్.
అయితే ఈ సినిమా స్ట్రెయిట్ మూవీనా? లేదంటే రీమేక్ సినిమానా? అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే కల్యాణ్ చెప్పిన కథకు చిరు ఓకే చెప్పారని.. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ అనే టాక్ ఉంది. కానీ మరో వెర్షన్ ప్రకారం.. ఈ సినిమా మలయాళ రీమేక్(Malayalam remake)గా రానుందని వినిస్తోంది. గతంలో వినిపించినట్టుగా ‘బ్రో డాడీ’ సినిమానే మళ్లీ తెరపైకి వచ్చింది.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి, కొడుకులుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మెగాస్టార్(Megastar) ఈ రీమేక్ చేయబోతున్నారనే టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ కొడుకుగా సిద్ధూ జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్టతోను చిరు ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు గత కొద్ది రోజులు ప్రచారం జరుగుతోంది. దాంతో అసలు చిరు(chiranjeevi) నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో.. ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం.