»Amalapuram Pawan Kalyan High Alert In Amalapuram Heavy Police Presence At Pawans Public Meeting
Pawan Kalyan : అమలాపురంలో హైఅలర్ట్..పవన్ బహిరంగ సభ వద్దకు భారీగా పోలీసులు
కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా నేడు అమలాపురంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమలాపురం(Amalapuram)లో హైఅలర్ట్(High Alert) నెలకొంది. అంబేర్కర్ కొనసీమ జిల్లాలో నేడు పవన్ కళ్యాన్(Pawan Kalyan) బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమలాపురం ప్రధాన సెంటర్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమలాపురంలో అల్లర్లను దృష్టిలో ఉంచుకుని పోలీసులు(Police) భారీ సంఖ్యలో చేరుకున్నారు. అంతేకాకుండా అమలాపురంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ (Trafic)ను డైవర్ట్ చేశారు.
ఈరోజు సాయంత్రం గడియారం స్థంభం సెంటర్లో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) బహిరంగ సభను నిర్వహించనున్నారు. తన ఎన్నికల ప్రచార రథం అయిన వారాహి(Varahi Vehicle) మీద నుంచే పవన్ ప్రసంగించనున్నారు. ఈ తరుణంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు(Police) చర్యలు తీసుకున్నారు. బహిరంగ సభ వద్ద భారీగా మోహరించారు.
కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పర్యటన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని అభిమానులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ స్థానిక సమస్యలను, వైసీపీ(YCP) పాలన తీరును చూపుతూ మాట్లాడనున్నారు. అలాగే జనసేన కార్యాచరణను ప్రజలకు వినిపించే అవకాశం కూడా ఉంది.