Six people were killed in one family nizamabad telangana
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌పై ఏఎస్ఐ సర్వే కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. సర్వే వల్ల నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందంటూ ముస్లిం పక్షం చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన తీర్పు తర్వాత హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్, ASI అఫిడవిట్ నిబంధనల ప్రకారం సర్వే జరుగుతుందని స్పష్టం చేసింది.
జ్ఞానవాపి ఈ పేరు వింటే భారతదేశ ప్రజలమదిలో ఏళ్ళ నాటి మాయని మచ్చ పుండు మీద కారంలా గుర్తుకు వస్తూనే ఉంటుంది. 1699లో క్రూర ముఘల్ పాలకుడు ఔరంగజెబ్ మత ఛాందసవాదంతో కూలగొట్టాడు. 12 జోతిర్లింగాలలో ఒకటిగా ఏంటో భక్తితో హిందువులు కొలుచుకునే కాశి విశ్వనాథ జ్యోతిర్లింగం కూడా అదే ఆలయంలో ఉంది అని చరిత్ర, అక్కడి ప్రజలు చెప్తారు. ఎప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం పూజలు అందుకుంటున్న శివలింగం మరాఠా మహారాణి కలియుగ కాళిగా ప్రజల మదిలో నిలిచిపోయిన అహల్యాబాయి హోల్కర్ తరువాతి కాలంలో కాలంలో నిర్మించారు. సిసలైన కాశి విశ్వనాథ ఆలయం ఎప్పటికి గ్యానవాపి పేరుతొ సగం మసీదు, సగం ఆలయ రూపంలో ఇంకా కూడా అలానే నిల్చుని వుంది.
బాబర్ హయాంలో అయోధ్య కూల్చబడింది. ఆ తరువాత ముఘల్ రాజులూ ఎన్నో గదులను కూల్చిన ప్రధాన లయల జోలికి రాలేదు. బాబర్ ముని మానవడైన ఔరంగజెబ్ మాత్రం తాటకి తగ్గ మనవడు అనిపించుకునేందుకు చాల మందిరాల మీద దాడులు చేసాడు. అందులో ప్రధానమైన ఆలయాలు మథుర శ్రీ కృష్ణ జన్మస్థానం, కాశి విశ్వనాథ ఆలయం.మథురలో కూడా కాశీలో లాంటి దృశ్యాలు కోకొల్లలు.
కాశి నగరానికి ఎవరైనా పర్యటనకి వెళ్తే కాశి పట్టణం చాల ఇరుకుగా ఉంటుంది. దానికి కారణం ఔరంగజేబు తన సైన్యంతో ఆలయంపై దాడికి వచ్చినపుడు వారికీ సౌకర్యంగా ఉండకూడదని అక్కడి ప్రజలు అప్పట్లో ఆలా పట్టణాన్ని నిర్మించారు. అయితే మీ మదిలో ఒక ప్రశ్న వస్తుండొచ్చు. ఔరంగజేబు కాశి ఆలయాన్ని కూల్చితే ఎప్పుడు మనం పూజలు చేస్తున్న ఆలయం ఎవరు కటించారు అని.
ప్రస్తుతం మనం కొలిచే కాశి విశ్వనాథ ఆలయాన్ని కటించింది మరాఠా వీర అహల్యాబాయి హోల్కర్ నారి. ఆమె శ్రీనగర్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, ప్రయాగ, వారణాసి, నైమిశారణ్య, పూరి, రామేశ్వరం, సోమనాథ్, నాసిక్, ఓంకారేశ్వర్, మహాబలేశ్వర్, పూణే, ఇండోర్, శ్రీశైలం, ఉడిపి, గోకర్ణ, ఖట్మాండు మొదలైన ఆలయాలను నిర్మించింది. ఆఫ్ఘన్లు, నవాబులు & బ్రిటీష్ వారి నియంత్రణలో ఉన్న భూభాగాలు మినహా భారతదేశం అంతటా ప్రతిచోటా ముష్కరులచే కూల్చబడిన ఆలయాలను పునర్నిర్మించింది.
ప్రస్తుతం జ్ఞానవాపి చుట్టూ వివాదాలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక పరిస్థితులలో కొంత మంది స్త్రీమూర్తులకు గ్యానవాపి లోపలికి వెళ్లి శృంగార గౌరీ దేవికి పూజలు చేయటానికి కోర్ట్ ద్వారా అనుమతులు ఇవ్వబడ్డాయి. కాళ్ళ ముందు కనిపిస్తూనే వున్నా ఏమి చేయలేని పారిస్తుతులలో ఉన్న హిందువులకి దైవాంశగా వచ్చారు లాయర్ విష్ణు జైన్ గ్యానవాపికి శాస్త్రియబద్దమైన సర్వే జరపాలి అని కోర్టులో కేసు వేశారు. కోర్ట్ సానుకూలంగా స్పందించి సర్వేకి ఒప్పుకుంది. మొదటిదశ సర్వే పూర్తీ పూర్తీ అయ్యే సమయానికి గ్యానవాపి ఉజు ఖానాలో శివలింగం దొరికిందని సర్వే బృందంలో కొంత మంది నినాదాలు చేసారు. బాబా మిల్గయే బాబా మిల్గయే అని ఆనంద తాండవం చేసుకుంటూ బయటకు వచ్చారు. వాజు ఖానాలో శివలింగాన్ని పోలిన ప్రతిమ బయటపడింది. ఆ ప్రతిమే పురాణం కాశి విశ్వనాధుని జ్యోతిర్లింగం అని అందరు భావిస్తున్నారు.
పరిస్థితులు ఎలా ఉండగా రెండవ దశ సర్వేకు కోర్ట్ ఉత్తర్వూలు జారీ చేసింది. సర్వే బృందాలు గ్యానవాపి వద్దకు చేరుకోగానే ముస్లిం పక్షం కోర్ట్ ద్వారా వాయిదా వేయించారు. అదేంటి కళ్ళముందు కనిపిస్తుంది కదా ఇంకా సర్వే ఎందుకు అని ఒక వర్గం వాదిస్తుండగా ఏ సమస్య అయినా చట్ట పరంగా ముందుకు పోవాలి అని ఒక వర్గం వాదిస్తుంది. 1992 places of worship act ప్రకారం ఉన్న పద్దతులను పాటించాలి అని ఇంకొక వర్గం వాదిస్తున్నారు.
ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి మాట్లాడుతూ జ్ఞానవాపిని మస్జీద్ అని అనటమే తప్పు అని చారిత్రక తప్పిదాన్ని ముస్లిం వర్గం ఒప్పుకుని సరిదిద్దాలని అయన అన్నారు. గ్యానవాపి లోపల త్రిసూలం ఉంది. ఇస్లాంలో ఎక్కడ కూడా త్రిసూలం ప్రస్తావన ఉండదు. లోపల జ్యోతిర్లింగం ఉంది దేవుని ప్రతిమలు ఉన్నాయి. అవి మేము పెట్టలేదు అని అన్నారు. అన్నిటికన్నా పీడా సాక్షి ఆలయంలోని నందీశ్వరుడు ప్రతి శివాలయంలో లేదా జ్యోతిర్లింగ క్షేత్రంలో నందీశ్వరుడు స్వవారికిని చూస్తూ ఉంటాడు. కానీ కాశీలో బసవన్న మాత్రం గ్యానవాపిని చూస్తూ ఉంటాడు. గ్యానవాపి గురించి ఎంత చెప్పుకునే తక్కువే అవుతుంది. ఇప్పటికైనా ఇరువర్గాలు కుర్చీని సమస్యకు పరిస్కారం వెతకాలని ప్రజలు ముక్తకంఠంతో ప్రజలు కోరుతున్నారు.