అమెరికా(America)లో కాల్పుల మోత(Gun Fire) ఆగడం లేదు. ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తుపాకీ కల్చర్(Gun Culture) వల్ల ఎప్పుడు ఎవరు ప్రాణం పోతుందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్ లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు(Gun Fire) జరపడంతో ఐదుగురి ప్రాణాలు (5 died) పోయాయి.
క్లీవ్ లాండ్ ప్రదేశంలో ఓ వ్యక్తి ఐదుగురిపై కాల్పులు(Gun Fire) జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మరణించిన వారిలో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా అక్కడున్నవారు అభ్యంతరం తెలిపారు.
ఇంట్లోని వారు నిద్రపోతున్నారని, శబ్దాలు చేయొద్దని అక్కడున్న మహిళలు కూడా వారించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి తుపాకీతో పొరుగింటి వారిపై కాల్పులు(Gun Fire) జరిపాడు. ఆ వ్యక్తి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అక్కడున్నవారు తప్పించుకోలేకపోయారు. కాల్పుల సమయంలో ఆ ఇంట్లో 10 మంది వరకూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు(Police Case) చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకూ 174 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.