మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై కమల నాథులు పోకస్ చేశారు. కర్ణాటకలో జరిగిన తప్పులను మరే రాష్ట్రంలో జరుగకూడదని జాగ్రత్త పడుతున్నారు. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై లోకల్ నాయకులను రెడీ చేస్తున్నారు.
కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ మరింత పక్కాగా అడుగులు వేయడానికి రెడీ అవుతోంది. రానున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో రివాల్వింగ్ డోర్ ట్రెండ్‌ని, అధికార వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.
నాలుగు రాష్ట్రాల్లో నాయకత్వ సమస్య మరియు అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకోవాలని బిజెపి నిర్ణయించిందని పార్టీ సీనియర్ నాయకులు ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పారు. కర్ణాటకలో BS యడియూరప్పను ఉన్నత పదవి నుండి తొలగించడం, జగదీష్ షెట్టర్ మరియు లక్ష్మణ్ సదవిలకు టిక్కెట్లు నిరాకరించడం వంటి దాని నిర్ణయం లింగాయత్‌లను కాంగ్రెస్ వైపు నెట్టిందని బీజేపీ అంతర్గత నాయకులు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక నుండి ఇది కఠినమైన పాఠమని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో… అవసరమైతే, చిన్న పార్టీలతో ఎన్నికల పొత్తులకు కూడా సిద్ధంగా ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కర్నాటకలో హెచ్డి కుమారస్వామితో జతకట్టడం వల్ల బిజెపికి కొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉండేదని పలువురు భావిస్తున్నారు.
కాంగ్రెస్ లో అతిపెద్ద మార్పు ఏమిటంటే, కేంద్ర నాయకులపై అధికంగా ఆధారపడే బదులు స్థానిక నేతలకు ప్రచారం కల్పించడం కాంగ్రెస్‌కు బాగా పనికొచ్చింది. కర్ణాటక ఎన్నికలో ఒకరకంగా కాంగ్రెస్ అగ్రనేతలు అధికంగా ప్రచారంలో పాల్గొనలేదు. కర్ణాటకలో జగదీష్ షెట్టర్ వంటి నేతలకు టికెట్ నిరాకరించడం కీలక సమస్యగా భావించారు. రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్‌లలో ఈ వ్యూహం చాలా కీలకంగా మారింది, ఇక్కడ పొత్తులలేమి అనేది పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి.
మధ్యప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీకి ముఖంగా ఉంటారని, అయితే అతనితో పాటు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ మరియు బిడి శర్మ వంటి ఇతర నాయకులను ప్రముఖంగా ఉంచాలని, వారికి ప్రచారబాధ్యతలు, కీలక పదవులు ఇవ్వాలని బీజేపీ వర్గాలు నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. 2020లో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేపీలో చేరిన సింధియా మరియు అతని విధేయులు బయటి వ్యక్తులుగా ఫీల్ అవకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నారు.
రాజస్థాన్‌లో, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే – కేంద్ర నాయకత్వంతో పడటంలేదనేది భహిరంగ రహస్యం అయితే కిరోరి లాల్ మీనా, గజేంద్ర సింగ్ షెకావత్, సతీష్ పూనియా వంటి వివిధ కుల సమూహాలకు చెందిన రాష్ట్ర నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీనియర్ నేత బ్రిజ్మోహన్ అగర్వాల్, అరుణ్ సావోలకు ప్రాధాన్యత ఇవ్వగా, తెలంగాణలో బండి సజయ్, ఈటల రాజేందర్, జి కిషన్ రెడ్డిలు పార్టీకి కీలకంగా మారనున్నారు. రాష్ట్ర నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని, ఐక్య ఫ్రంట్‌ను ప్రదర్శించాలని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.