ప్రకాశం: కురిచేడు మండలం అలవలపాడు గ్రామ సమీపంలో సోమవారం చెట్టును ఢీ కొట్టి ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎర్రగుంట్ల మహేష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లుగా స్థానికులు చెప్పారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.