PPM: కురుపాం మండలం ఈతమానుగూడలో శుక్రవారం వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు భర్తతో గొడవపడి మండంగి సుగన్ని (24) మలేరియా మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. హుటాహుటీన మొండెంఖల్లు పీహెచ్సీకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Tags :