‘ఆదిపురుష్’ సినిమా(Adipurush Movie) మరో వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ విడుదల కాకముందు నుంచే అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. మూవీ విడుదలయ్యాక ఇంకొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అవి చాలవన్నట్లుగా మరికొన్నింటిని ఆ సినిమా రచయిత మనోజ్ శుక్లా(Manoj Shukla) సృష్టిస్తున్నారనడంలో సందేహం లేదు. ఆదిపురుష్ మూవీలో డైలాగ్స్(Dialogues) విషయంలో ఇప్పటికే మనోజ్ తీవ్ర విమర్శల పాలయ్యారు.
హనుమంతుడు అసలు దేవుడే కాదన్న ‘ఆదిపురుష్’ రైటర్ వీడియో:
“बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” –@manojmuntashir
తాము తీసింది అసలు రామాయణమే కాదని మొన్నటికి మొన్న మనోజ్(Manoj Shukla) చెప్పారు. ఇప్పుడు హనుమంతుడు(Hanuman) అసలు దేవుడే కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..అసలు హనుమంతుడు దేవుడే కాదని అన్నారు. ఆయన కేవలం రాముడి భక్తుడేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
హనుమంతుడు(Hanuman) శ్రీరాముడిలా మాట్లాడడని, తాత్వికంగా మాట్లాడడని, ఆయన భగవంతుడు కాదని, భక్తుడు మాత్రమేనని ఆదిపురుష్ రచయిత మనోజ్(Manoj Shukla) అన్నారు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడని, అంతేకానీ ఆయన దేవుడు కాదని తెలిపారు. హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి ఆయన్ను అందరూ దేవుడిని చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన డైలాగ్స్ (Dialogues)లో తప్పు లేదని సమర్ధించుకున్నారు. మనోజ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.