»2000 Notes Amazon Has Given Good News Lets Exchange Rs 2000 Notes From Home
2000 Notes: గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్..ఇంటి నుంచే రూ.2 వేల నోట్లు మార్చుకోండిలా
రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
భారత ప్రభుత్వం, ఆర్బీఐ(RBI) రూ.2 వేల నోట్లు(2000 Notes) మార్చుకోవాలని, తమ తమ బ్యాంకుల్లో డిపాజిట్(Deposite) చేసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమెజాన్(Amazon) అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 వేల నోట్ల మార్పిడికి బ్యాంకుకు వెళ్లలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ సమస్య ఉండదు. మీరు ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ రూ.2 వేల నోట్ల డిపాజిట్ సర్వీసులను ప్రారంభించింది.
తమ కస్టమర్లకు పే క్యాష్ లోడ్ ఆప్షన్ను అమెజాన్(Amazon) అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా అమెజాన్ యూజర్లు రూ.2 వేల నోట్లను సులభంగా డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ నేరుగా అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్లో(Amazon Pay Balance Account)కి చేరుతాయి. నెలకు రూ.50 వేల వరకూ రూ.2 వేల నోట్ల(2000 Notes) ను అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలోకి డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ అమౌంట్ తో కొనుగోళ్లు చేయవచ్చు. అలాగే స్టోర్స్ లో స్కాన్ అండ్ పే ద్వవారా పేమెంట్లు కూడా చేయొచ్చు.
అమెజాన్(Amazon)లో షాపింగ్ చేశాక అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి డెలివరీ బాయ్ రాగానే మీ వద్ద ఉండే రూ.2 వేల నోట్ల(2000 Notes) ను ఇవ్వండి. డెలివరీ బాయ్ ఆ అమౌంట్ ను మీ అమెజాన్ పే అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు. అవి మీ అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్లో(Amazon Pay Balance Account)కి జమ అవుతాయి. ఇలా మీరు రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మీ ఖాతాలోకి డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్బీఐ సెప్టెంబర్ 30వ తేది లోగా రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. కాబట్టి ఇంకా మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే ఇంటి నుంచే అమెజాన్ ద్వారా మార్చుకుని డిపాజిట్ చేసుకోండి.