సాధారణంగా పాము పేరు చెబితేనే భయంతో చాలామంది వణికిపోతారు . ఇక కింగ్ కోబ్రా (King Cobra) అంటే మాటలా.. పాములన్నిటిలోనూ అత్యంత విషపూరితమైనది, అతి పెద్దది కూడాను. అలాంటి పాము నీటికోసం అల్లాడుతుంటే అది విష జంతువని తెలిసికూడా మానవత్వంతో నీరు తాగించాడు ఓ వ్యక్తి. దాహం (thirst) తో అల్లాడుతున్న ఆ జీవి ఎంతో ఆబగా నీళ్లు తాగింది. నీళ్తుతాగుతున్నప్పుడు ఆ పాము కళ్లలో సంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పాము పైపుద్వారా అందిస్తున్న నీటిని ఆర్తిగా తాగుతోంది. ఈ వీడియో ను ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షలమందికి పైగా వీక్షించి లైక్ చేశారు.వేలాదిమంది తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఆ వ్యక్తి మానవత్వాన్ని మెచ్చుకుంటూనే అతని ధైర్యానికి సలాం అంటున్నారు.
అయితే ఇలా చేయడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎండాకాలం (Summer)పూర్తైనా ఏ మాత్రం వేడి తగ్గలేదు. మనుష్యులు వేడిని తట్టుకోలేకపోతుంటే జంతువుల పరిస్థితి మరీ ఘోరం. వీటికి సరైన ఆహారం, నీరు దొరకక చనిపోతుంటాయి. అయితే ప్రమాదకరమైన సరీసృపాల(Reptiles)కు నీరు అందించడమంటే మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకి ఎంతో ధైర్యంగా.. దయతో నీళ్లు పట్టిస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. . ప్రతి వ్యక్తిలో జంతువుల పట్ల దయ, కరుణ ఉన్నా.. వాటికి సాయం చేయడానికి ధైర్యం కావాలి.. ఏ మాత్రం ఏమరుపాటుతనంతో వ్యవహరించినా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అలాంటి ప్రమాదకర జంతువులకి సైతం మానవత్వాన్ని చూపించిన వ్యక్తిని నెటిజన్లు (Netizens) అభినందిస్తున్నారు.