»Actress Anju Krishna Caught In Drug Case Heroine Who Gave Clarity Anju Krishna Ashok
Drug Case: డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటి..క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని చెప్పింది. అంజు కృష్ణ అనే నాటక నటిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
మనఅభిమాన నటుడు లేదా నటి ఏదైనా నేరాలకు పాల్పడితే వారిని చూడటం కొంచెం బాధగా అనిపిస్తుంది. చాలా మంది వారిని తమ రోల్ మోడల్‌లుగా భావిస్తారు. కానీ వారు మాత్రం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి దొరికితే వారి అభిమానులు నిరాశ చెందుతారని చెప్పవచ్చు. అయితే డ్రగ్స్ కేసుల్లో నటీనటులు పట్టుబడటం ఇప్పుడు కొత్తం ఏం కాదు. ఈ క్రమంలో ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అంజు కృష్ణ అనేక సినిమాలు, టీవీ షోలలో నటించిన ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. ఆమె అరెస్టు వార్తను అక్కడి సినీ పరిశ్రమతోపాటు ఆమె అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది.
అంజు కృష్ణ మాదకద్రవ్యాలు కలిగి ఉన్నందుకు కజకుట్టం పోలీసు డిపార్ట్మెంట్ ఆమెను మార్చి 20న అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ ఉన్నాయనే సమాచారంతో ఉన్న అంజు అపార్ట్‌మెంట్‌పై దాడి చేసిన క్రమంలో పోలీసులు 52 గ్రాముల MDMAను గుర్తించారు. అది ఆమె తన ఫ్లాట్‌లో దాచిపెట్టిన సింథటిక్ డ్రగ్ అని తేలింది. అయితే అంజు మాత్రం మాదకద్రవ్యాల వ్యాపారంలో తన ప్రమేయం లేదని వెల్లడించింది. తన ఫ్లాట్‌లో ఎవరో డ్రగ్స్ పెట్టారని తనకు ఏమి తెలియదని చెబుతోంది. ఆమె ఫ్లాట్‌లో దొరికిన డ్రగ్స్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అంజు కృష్ణ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా, విచారణ కొనసాగుతోంది.
మరోవైపు ఎర్నాకుళంలో ఇంటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని తెలిపింది. దీనిపై అంజుకృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. దోషులను ట్యాగ్ చేయడమే కాకుండా మీడియా వారిని కూడా ట్యాగ్ చేసింది. ఇలాంటి గందరగోళాన్ని నివారించేందుకు ఇటువంటి ట్యాగ్‌లను తొలగించాల్సిందిగా అభ్యర్థించారు. లేకుంటే న్యాయపోరాటం చేస్తానని అంజు కృష్ణ అన్నారు. మంగళవారం 56-గ్రామ్ ఎం.డి.ఎమ్.ఎతో అంజు కృష్ణ అనే నాటక నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతితో పాటు ఉన్న కాసర్కోట్కు చెందిన షమీర్ పారిపోగా.. అతన్ని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.