ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యం కారణంగా బెయిల్ కోసం అభిషేక్ బోయినపల్లి పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ అధికారులకు మొబైల్ నంబర్ ఇవ్వాలని, తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్‌లో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ట్రయల్ కోర్టు అనుమతితో అభిషేక్ బోయినపల్లిని హైదరాబాద్ వెళ్లాల్సిందిగా ఆదేశించింది. బెయిల్ మంజూరు చేసినప్పటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ట్రయల్ కోర్టు పేర్కొంది. మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొననున్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అభిషేక్ బోయినపల్లి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. పాస్‌పోర్టును అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఈడీ అధికారుల కస్టడీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటరాగేషన్‌ను ఎదుర్కొంటున్నారు.