ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అధిక మొత్తంలో వర్షపాతం నమోదు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. గురువారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పంట నష్టం అంచనా వేయాలని ఆయన అధికారులకు సూచించారు.