TG: మొంథా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కురవడంతో వరంగల్, హన్మకొండ జిల్లాలు నీట మునిగాయి. హన్మకొండ వరంగల్ రెండు జిల్లాల్లోనూ 115 పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి కొండా సురేఖ సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.