అల్లూరి: భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గురువారం డిప్యూటీ ఎంపీడీవో బాబూరావుతో మంప పంచాయతీలో పర్యటించారు. మంప, కించెవానిపాలెంలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని కార్యదర్శి రవిని ఆదేశించారు.