NLG: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిల్లాపురం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. వాటర్ డంపింగ్ యార్డు నుంచి నీరు తొలగించడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.