CTR: పుంగనూరు మున్సిపల్ కార్మికులు పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు రాయల్ కుమార్ పేర్కొన్నారు. దీపావళి కానుకగా గురువారం పుంగనూరు మున్సిపల్ కార్మికులకు దుస్తులను అందజేశారు. ప్రతిరోజు పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు జీవించేలా వారు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ తోపాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.