NLG: బాగా చదువుకోవడం ద్వారానే సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు సూచించారు. ఇందుకు రెగ్యులర్గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆమె శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరును పరిశీలించారు. బోర్డుపై విద్యార్థులకు పాఠాలు చెప్పారు.