హనుమకొండలోని అలంకార్ సర్కిల్, కాపువాడ, ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డతో కలిసి ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ట్రాక్టర్లో వెళ్లిన ఎంపీ నీటమునిగిన ప్రాంతాలను సందర్శించి, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు పాల ప్యాకెట్లు, త్రాగునీరు పంపిణీ చేస్తూ సహాయం అందించారు.