If Pawan contests as MP, I will contest from Pithapuram: SVSN Varma
SVSN Varma: ఆంధ్రప్రదేశ్ రాజకియాల్లో రోజుకింత హీట్ పెరుగుతున్న సందర్భంలో పిఠాపుర్ టీడీపీ ఇన్చార్జీ ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma) సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పవన్ కల్యాణే ఆలోచిస్తున్నట్టు స్వయంగా చెప్పారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించారు. ఒకటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఫిక్స్ అయింది. తరువాత ఎంపీ సీటు ఎవరికన్నది ఇంకా డిసైడ్ కాలేదు. పవన్ కల్యాణ్ పోటీ చేయరని చెప్పలేము అన్నారు.
ఒకవేళ పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం అసెంబ్లీ బరి నుంచి తాను పోటీ చేస్తానని పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఏదేమైనా, పొత్తుధర్మం ప్రకారం చంద్రబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం స్పష్టం అని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులను బలోపేతం చేస్తున్నట్లు కూటమి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.