SRD: ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వృద్ధురాలు మృతి చెందింన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సిర్గాపూర్ మండలంలోని బొక్కస్ గాంకు చెందిన మదిస్థిమితం లేని వడ్డే నాగమ్మ(74) సోమవారం సాయంత్రం పక్కనే ఉన్న నల్లవాగు డ్యాంలో స్నానం చేసేందుకు వెళ్లి, కాలుజారి నీటిలో మునిగింది. అయితే మంగళవారం మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు తెలుపగా, కేసు నమోదు చేశారు.