»A 8 Years Boy Was Murder On Amavasya Day Sanath Nagar Hyderabad
Murder: హైదరాబాద్‌లో దారుణం..అమావాస్య రోజు బాలుడి నర బలి!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్(Hyderabad sanath nagar)లో విషాదం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే అమావాస్య కావడంతో బాలుడిని బలితీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్(hyderabad) సనత్ నగర్ లో దారుణం జరిగింది. సనత్‌నగర్(sanath nagar)లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపుతోంది. నిన్న అమావాస్య రోజు కావడంతో బాలుడిని బలి ఇచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు అదే ప్రాంతంలో నివసిస్తున్న హిజ్రా నరబలి ఇచ్చాడని ఆరోపిస్తూ బాలుడి బంధువులు, స్థానికులు అతని ఇంటిపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్ వహీద్ (8) గురువారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రులు(parents) పరిసర ప్రాంతాల్లో వెతికే సరికి రాత్రి 8.30 గంటల సమయంలో జింకలవాడ నాలాలో ఓ మృత దేహాన్ని గుర్తించారు. బకెట్లో కుక్కి ఉన్న బాలుడిని చూసిన వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.