కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వరదయ్యపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి (14) వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం యథావిధిగా బాలిక పాఠశాలకు వచ్చింది. అయితే మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కడుపునొప్పితో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న గురుకులం సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరిశీలించిన వైద్యులు షాక్ కు గురయ్యాయి. బాలిక గర్భిణి అని నిర్ధారించారు. నెలలు నిండడంతో వెంటనే బాలికకు అత్యవసరం ప్రసవం చేయగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారు.
అయితే బాలిక గర్భం దాల్చిన విషయం కుటుంబసభ్యులు, గురుకులం సిబ్బంది గుర్తించకపోవడం విస్తుగొల్పుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. మేనమామ అయిన వ్యక్తి బాలికపై లైంగిక దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.