KKD: తాళ్లరేవు మండలం కోరంగి పీఎస్ పరిధిలో మంగళవారం యానాంకిపాలెపు శ్రీను (45) హత్యకు గురయ్యాడు. శ్రీను అతని స్నేహితుడికి మధ్య సెల్ ఫోన్ విషయంలో మురళీనగర్ వద్ద ఘర్షణ జరిగింది. శ్రీనుని అతని స్నేహితుడు తలపై రాయితో మోది చంపాడు. అనంతరం ఇసుక గుట్టలో మృతుడి తలను కప్పేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.