BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. మార్కెట్ ప్రాంతంలో 15 మందిపై దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించి యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అధికారులు స్పందించి వెంటనే కుక్కల దాడుల నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.