సత్యసాయి: బుక్కపట్నం మండలానికి చెందిన నారాయణస్వామి అనే వ్యక్తి బుధవారం ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి రావడంతో విషయం బయటపడింది. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి, పోలీసులు నారాయణస్వామిని అదుపులోకి తీసుకున్నారు.