NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గాంధీ గుడిని VJA-HYD జాతీయ రహదారి పై ప్రయాణించే వారు భక్తితో దర్శించుకుంటున్నారు. గుడికి వచ్చిన భక్తులకు కంకణధారణ, అర్చన చేసి హారతి ఇచ్చి, డ్రై ఫ్రూట్స్‌ను ప్రసాదంగా అందిస్తామని ఆలయ అర్చకులు కూరెళ్ళ నరసింహాచారి తెలిపారు. గాంధీ కూడా దైవ స్వరూపమేనని, భక్తులు కోరుకున్న కోరికలు తీరుస్తున్నారని తెలిపారు.