MNCL: రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే చేపడతామని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ రమేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. సింగరేణికి పాత స్టోర్, ఇతర భవనాలు అడ్డుగా ఉండటంతో పనులు ఆలస్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, తమ నిర్మాణాలను తొలగించి, కొత్త ప్రహరీలు నిర్మించుకున్న తర్వాత రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.