ప్రకాశం: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన 661 మందికి జిల్లాస్థాయి ప్రాథమిక శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు కేంద్రాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 3 నుంచి 10వతేదీ వరకు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఈనెల 9,10 తేదీల్లో కొత్త టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, పాఠశాలలు కేటాయించి పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.