MNCL: దసరాను జన్నారం మండల ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు దసరాను సాంప్రదాయంగా నిర్వహించుకుంటారన్నారు. సాయంత్రం జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఆమె సూచించారు.