మేడ్చల్: ఉప్పల్ పరిధిలో బంతిపూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దసరా పండుగ వేళ కిలో బంతిపూలు రూ.100 నుంచి రూ.140 పలుకుతున్నాయి. చామంతి పూలు కిలో రూ.400 ఉన్నట్లుగా ఉప్పల్ పెద్ద మార్కెట్ వ్యాపారులు తెలిపారు. పూలతో పాటుగా, గరక, వివిధ రకాల తృణ ధాన్యాల రేట్లు సైతం ఉప్పల్ పెద్ద మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులు పెంచేశారు.