ATP: పింఛన్ పంపిణీలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. జిల్లాలో 1వ తేదీన 95.53 శాతం పంపిణీ పూర్తయింది. 2,79,933 మందికి గానూ 2,67,402 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్ పంపిణీ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ జిల్లాకు ప్రథమ స్థానం లభించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన పింఛన్ లబ్ధిదారులకు రేపు అందజేయనున్నారు.