ఉమ్మడి వరంగల్ జిల్లాలో జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ పై గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల ఆర్థిక బలంతో జనరల్ స్థానాలను రిజర్వు కోటాలోకి మార్చారని ప్రచారం జరుగుతుంది. వరంగల్ జడ్పీ ఛైర్మన్ స్థానం ఎమ్మెల్యే దొంతి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వైరం కారణంగా ఎస్టీకి రిజర్వు అయినట్టు చర్చించికుంటున్నారు. నర్సంపేట అసెంబ్లీ స్థానం కూడా ఎస్టీకి రిజర్వు కానున్నట్టు సమాచారం.