NGKL: అచ్చంపేటలోని నాగర్కర్నూల్ రోడ్డులో ట్రెండ్స్ షోరూమ్ ముందు మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.