సత్యసాయి: సోమందేపల్లి మండలం మాగేచెరువు పంచాయతీలో నూతన సచివాలయంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ముందుగా గాంధీ జయంతి సందర్బంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మాగేచెరువు పంచాయతీ అభివృద్ధి గురించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.