MBNR: జడ్చర్ల పట్టణంలో గురువారం ఓ చిన్న హోటల్‌ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే చిన్న హోటళ్లలో మంచి రుచులు ఉంటాయని అన్నారు. హంగులు, ఆర్భాటాలు లేని చోటే రుచికరమైన వంటకాలు దొరుకుతాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వంటకాలు రుచిగా ఉంటాయని చిన్న చిన్న హోటళ్లలో పోషకాహారం లభిస్తుందని పేర్కొన్నారు.