NZB: ధర్పల్లిలోని గాంధీ చౌక్‌లో గురువారం మహాత్మా గాంధీ 156వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న బాలరాజ్, మండల నాయకులు, కార్యకర్తలు విగ్రహాలకుపూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసా మార్గంలోస్వాతంత్య్రన్ని సాధించి గాంధీ మహాత్ముడు అయ్యారని, శాస్త్రి దేశ ప్రధానిగా సేవలందించారని వారుకొనియాడారు.