ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. గాంధీ జయంతి కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు ముందస్తు కొనుగోళ్లు చేసినప్పటికీ అమ్మకాలు పడిపోయాయి. అక్టోబర్ 1న కేవలం రూ.5.15 కోట్ల మద్యం అమ్ముడైంది, గత ఏడాదితో పోలిస్తే రూ.2 కోట్లు తక్కువగా ఉందని అధికారులు ఇవాళ తెలిపారు.