KMM: దేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని మధిర సేవా సమితి అధ్యక్షులు ప్రసాదరావు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మధిర సుందరయ్య నగర్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బ్రిటిష్ వారిచే ఎన్ని అవమానాలు పడిన తన ఎన్నుకున్న అహింసా సిద్ధాంతంతో పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకొనివచ్చిన మహానుభావులు గాంధీ అని కొనియాడారు.