W.G: తణుకులో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సురేష్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గత నెల 23న అదృశ్యమైన సురేష్ హత్యకు గురయ్యాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడైన న్యాయవాది సత్యనారాయణ రాజుతో పాటు మరో నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. డెడ్ బాడీని మాయం చేస్తే కేసు వీగిపోతుందనే పన్నాగం పన్నినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు తెలిపారు.