AP: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య ఉద్యమంలో ముందు నడిచి కోట్లాది భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించారు. గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలి’ అని పేర్కొన్నారు.