JGL: పట్టణంలోని టవర్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తూరి గంగాధర్ ఆధ్వర్యంలో నిత్య జనగణమన 8వ వార్షికోత్సవంలో జాతీయ గీతాలాపన నిర్వహించారు. ప్రజలకు జూట్ బ్యాగులను పంపిణీ చేయగా, మాజీ వైస్‌ఛైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.